Thursday, March 6, 2014

ఇందుకే తెలుగు అమ్మాయిలకు సినిమా ఛాన్స్లు రావట్లేదు

ఉత్తరాది అమ్మాయిలతో పోలిస్తే తెలుగు సినిమాల్లో
తెలుగు అమ్మాయిలకు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ.
అప్పుడప్పుడు అలా కొందరు అమ్మాయిలు మెరిసినా ఆ
మెరుపు తాత్కాలికంగానే ఉంటోంది. ఎందుకిలా జరుగుతోంది.
తెలుగు అమ్మాయిలు అందంగా ఉండరా? అంటే
ఎందుకు ఉండరు. కచ్చితంగా ఉంటారు. సినిమాకు ప్రధానంగా
కావాల్సింది అందమే కదా! అయినా కూడా
ఎందుకు ఆఫర్లు రావడం లేదు.
ఈ ప్రశ్నకు ఇండస్ర్టీ ఇస్తున్న
సమాధానం తెలుగు అమ్మాయిలు ప్రొఫెషనల్గా
ఉండటం లేదని. అందాల ఆరబోతలో గానీ, రొమాన్స్లో గానీ
బాలీవుడ్ తారలతో మన అమ్మాయిలు పోటీ
పడలేకపోతున్నారు. ఫ్యామిలీ ప్రెజర్స్ కారణంగా ఇలా
జరుగుతోందని చెబుతున్నారు.
ఏ హిట్ లేని బాలీవుడ్ హీరోయిన్ ఒకటి రెండు సినిమాల్లో
నటిస్తే చాలు రూ.35 నుంచి 40 లక్షలు డిమాండ్ చేసే
స్థాయికి వస్తోంది. దర్శకుడు ఎలా చెబితే అలా నటించడం,
నటనకు సంబంధించి, ప్రొఫెషన్కు సంబంధించిన
మెలకువలు ముంబాయిలో నేర్చుకుని ఉండటం వల్ల
బాలీవుడ్ భామలు స్ర్కీన్ ముందు, స్ర్కీన్ వెనుకల ఇట్టే
ఒదిగిపోతున్నారు. తెలుగు అమ్మాయిలు ఇలా శిక్షణ
తీసుకోవడం లేదని, సరైన శిక్షణ ఇచ్చే సంస్థ ఏదీ
హైదరాబాద్ లేదని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
హీరోయిన అయిన ప్రతి అమ్మాయి తన వెంట తల్లిని
తీసుకురావడం, అసిస్టెంట్లను తీసుకురావడం ఎక్కువగా
జరుగుతోంది. రీసెంట్గా హీరోయిన్ అయిన ఒక
యాంకర్ను షూటింగ్ కోసం ఫారిన్ తీసుకెళితే తనకో రూమ్,
అసిస్టెంట్కో రూమ్, తల్లికో రూమ్ కావాలని అడిగందట.
అంతే ఆమెకు ఆ సినిమానే లాస్ట్ అయింది.
తెలుగు హీరోలు కూడా తెలుగు అమ్మాయిలతో రొమాన్స్
చేయడానికి ఇబ్బంది పడుతున్నారట. స్కిన్ కలర్ వలన
కావొచ్చు. లోకల్ ఫీలింగ్ వలన కావొచ్చు. వారికి
తెలుగు అమ్మాయిలు సిస్టర్స్ మాదిరిగా కనిపిస్తున్నారట.
ఈ వాదనలో అంతగా పస లేకపోవచ్చు. విజయశాంతి,
రమ్యకృష్ణ లాంటి తారలు అప్పట్లో ఒక
వెలుగు వెలగలేదా?
అయితే అప్పటికీ ఇప్పటికీ తేడాలు వచ్చాయి. అప్పట్లో
బికినీలు, లిప్కిస్లు లాంటివి రేర్గా ఉండేవి. ఇలాంటి
దృశ్యాలు ఇప్పుడు కామన్గా మారుతున్నాయి. ఇంతటి
శృంగారాన్ని ఒలకబోయడానికి
అందగత్తెలు తెలుగు అమ్మాయిలు చాలా తక్కువగా
ముందుకు వస్తున్నారని కొందరు సినీ
పండితులు విశ్లేషిస్తున్నారు.
సినిమా తెర మీద కనిపించి సక్సెస్ఫుల్ హీరోయిన్గా
పేరు తెచ్చుకోలేకపోతే పెళ్లి చేయడం చాలా కష్టమవుతుందని
పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. పైగా ఇక్కడ సరైన
భద్రత లేదని వారు భయపడుతున్నారు. ఇలాంటి
వాతావరణాన్ని తొలగించాల్సిన బాధ్యత ఇండస్ర్టీ
పెద్దలపైనఉంది. సినిమా హీరోయిన్ కావడం కూడా ఒక
ప్రొఫెషనేని తల్లిదండ్రులు భావించే స్థితిని తీసుకువస్తే
బాలీవుడ్ భామలకు భారీగా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి
నిర్మాతలకు తప్పుతుందని పరిశీలకులు సూచిస్తున్నారు.
అయితే ఏమి చెప్పుకున్నప్పటికీ తెల్ల తోలు మీద
మనకుండే
వ్యామోహం తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకుండా
చేస్తోందని బల్లగుద్ది చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో మన
దర్శకులు బాలీవుడ్ను దాటుకుని విదేశాల నుంచి
భామలను దిగుమతి చేసుకునే పనిలో ఉన్నారు.
ముందు దర్శకుల మైండ్సెట్ మారితే తెలుగు అమ్మాయిలకే
కాదు, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా
అవకాశాలు వస్తాయి.

No comments:

Post a Comment